భక్తి భావాన్ని అలవర్చుకోవాలి : మంత్రి జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-11-21T00:46:57+05:30 IST

: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకో వాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.

భక్తి భావాన్ని అలవర్చుకోవాలి : మంత్రి జగదీష్‌రెడ్డి
పడిపూజలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటరూరల్‌, నవంబరు20: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకో వాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని గాంధీనగర్‌ సమీపంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు దేవరకొండ జనార్దన్‌ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన శివయ్య మహాపడి పూజ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టే జానయ్యయాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వల్లాల సైదులుయాదవ్‌, శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, సైదులు, శ్రీకాంత్‌, మహేష్‌, మాలధారణ స్వాములు పాల్గొన్నారు.

శివాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

హుజూర్‌నగర్‌: పట్టణంలోని పార్వతీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అంతకముందు లక్ష కుంకుమార్చన, ప్రత్యేకా భిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కీత మల్లిఖా ర్జునరావు, జయ, ప్రతికంఠం భారతి, వంకాయల పద్మావతి, ఆసోజు శ్రీనివాస్‌, సురేష్‌, రెంటాల సతీష్‌శర్మ, సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-21T00:46:57+05:30 IST

Read more