‘సాగర్‌’ ఎనిమిది క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2022-10-04T07:00:27+05:30 IST

నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, ఒక క్రస్ట్‌ గేటు నుంచి 91,024 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

‘సాగర్‌’ ఎనిమిది క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల
నాగార్జునసాగర్‌ క్రస్ట్‌ గేట్ల నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు

ఎగువ నుంచి 91,024 క్యూసెక్కుల వరద

నాగార్జునసాగర్‌, అక్టోబరు 3:  నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, ఒక క్రస్ట్‌ గేటు నుంచి 91,024 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 589.70 అడుగులుగా(311.1486టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడికాల్వ ద్వారా 5,088 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 4,547 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32724 క్యూసెక్కులు, ఎ్‌సఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరదకాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ఎనిమిది క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 64,552 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 1,09,711 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, ఎగువనుంచి 91,024 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.


Updated Date - 2022-10-04T07:00:27+05:30 IST