భువనగిరి ఖిల్లాపై సందర్శకుల సందడి
ABN , First Publish Date - 2022-06-27T06:59:46+05:30 IST
చారిత్రాత్మక భువనగి రి ఖిల్లాపై సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. వేసవి ముగిసి వాతావరణం చల్లబడటంతో పెద్ద సంఖ్య లో పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు.
భువనగిరి టౌన్, జూన్ 26: చారిత్రాత్మక భువనగి రి ఖిల్లాపై సందర్శకులతో ఆదివారం సందడి నెలకొంది. వేసవి ముగిసి వాతావరణం చల్లబడటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఖిల్లాను సందర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబాలతో సహా వచ్చి ఖిల్లాపై ఉల్లాసంగా గడిపారు. ఇదిలా ఉండగా, వరుసగా కురుస్తున్న వర్షాలతో ఖిల్లాపై పెరిగిన పచ్చదనం మరింత శోభను చేకూర్చింది. అలాగే ఖిల్లాపై ఉన్న కొలనులో విరబూసిన కలువలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.