విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2022-09-17T06:40:52+05:30 IST
విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలని యజ్ఞ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గుంటోజు బ్రహ్మచారి, పెరికేటి వెంకటాచారి కోరారు.
రామగిరి, సెప్టెంబ రు 16: విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయాలని యజ్ఞ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గుంటోజు బ్రహ్మచారి, పెరికేటి వెంకటాచారి కోరారు. శుక్రవా రం విశ్వకర్మ సంఘం ఆ ధ్వర్యంలో పట్టణంలోని పాతబస్తీ శివాలయం నుంచి విశ్వబ్రాహ్మణ వసతిగృహం వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. సమస్త మానవాళి సుఖసంతోషాలతో ఉం డాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం యజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యజ్ఞ కమి టీ కోశాధికారి రథం మురళీధర్, నాయకులు కాసోజు విశ్వనాథం, కొల్లోజు సత్యనారాయణ, కూరెళ్ల రమణాచారి, కంచనపల్లి చంద్రశేఖర్, రమేష్, కొండయ్య, న రసింహాచారి, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.