బాధితులకు భరోసా కల్పించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2022-01-18T06:09:07+05:30 IST

బాధితుల ఫిర్యాదుల పై వేగంగా స్పందించి వారికి భరోసా కల్పించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లాలోని పోలీ్‌సస్టేషన్ల రిసెప్షనిస్టులకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బాధితులకు భరోసా కల్పించాలి: ఎస్పీ

సూర్యాపేటటౌన్‌, జనవరి 17 : బాధితుల ఫిర్యాదుల పై వేగంగా స్పందించి వారికి భరోసా కల్పించాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లాలోని పోలీ్‌సస్టేషన్ల రిసెప్షనిస్టులకు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీ్‌సస్టేషన్లలో రిసెప్షనిస్టు ల విఽధులు ఎంతో ముఖ్యమని; బాధితులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతి ఫిర్యాదు నూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచి ంచారు. అంతకుముందు గ్రీవెన్స్‌డేలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు, వ్యాపారు లు కాలనీల్లో, నివాస సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నా రు. గ్రీవెన్స్‌డేలో 12 ఫిర్యాదులు స్వీకరించారు. సమావేశంలో సీఐ ఆంజనేయులు, రిసెష్పన్‌ సిబ్బంది, ఐటీ కోర్‌ ఎస్‌ఐ శివకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T06:09:07+05:30 IST