వెంకటనరసింహారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

ABN , First Publish Date - 2022-07-05T06:01:40+05:30 IST

తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటయోధుడు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అల్గుబెల్లి వెంకటనరసింహారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు సూర్యం, దివాకర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞానకేంద్రంలో వెంకటనరసింహారెడ్డి మృతదేహానికి పూల మాలలు వేసి సోమవారం నివాళులర్పించారు.

వెంకటనరసింహారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు
అల్గుబెల్లి వెంకటనరసింహారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న విమలక్క, చెరుకు సుధాకర్‌

సూర్యాపేటటౌన్‌/ ఆత్మకూర్‌(ఎస్‌), జూలై 4: తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటయోధుడు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అల్గుబెల్లి వెంకటనరసింహారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శులు సూర్యం, దివాకర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞానకేంద్రంలో వెంకటనరసింహారెడ్డి మృతదేహానికి పూల మాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు వెంకటనరసింహారెడ్డి అని కొనియాడారు. అంతకుముందు ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామం నుంచి సూ ర్యాపేట జిల్లాకేంద్రంలోని చండ్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం వరకు ర్యాలీ తరలించారు. మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం సూర్యాపే ట మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. 


పలువురు నాయకుల నివాళి

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు విమలక్క, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, డీసీ ఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, చెరుకు సుధాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేముల వీరేశం, గుమ్మడి నర్సయ్య, వివిధ పార్టీ నా యకులు కుంట్ల ధర్మార్జున్‌, మండారి డేవిడ్‌కుమార్‌, కోటేశ్వర్‌రావు, అచ్యుతరామారావు, కందాల దామోదర్‌రెడ్డి, పర్వతాలు, కాకి భాస్కర్‌, పాండురంగారావు, సత్యనారాయణరెడ్డి, వెంకటరామిరెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్‌, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, గంట నాగయ్య, కోట గోపి, బొల్లె జానయ్య, బుద్ద సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, ముద్దం కృష్ణారెడ్డి, వరికుప్పల వెంకన్న, కారింగుల వెంకన్న, అనంతుల మధు, కృష్ణ, సైదులు, బొడ్డు శంకర్‌, రంగారెడ్డి, చంద్రయ్య, మోహన్‌రెడ్డి, ఉపేంద్ర, దంతాల రాంబాబు తదితరులు వెంకటనర్సింహారెడ్డి మృతదేహానికి  నివాళులర్పించారు. 

Read more