Venkat reddy: షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇవ్వని వెంకట్ రెడ్డి
ABN , First Publish Date - 2022-11-02T11:22:39+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తెలంగాణలో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారంతో పది రోజుల గడువు ముగిస్తుంది. ఇంతవరకు షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇవ్వలేదు. క్లిన్ చీట్ ఇచ్చే వరకు ఎవర్ని కలవనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు.
మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంటూ.. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.