రూ.2500కోట్లతో ఎత్తిపోతల పథకం

ABN , First Publish Date - 2022-03-05T06:47:33+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

రూ.2500కోట్లతో ఎత్తిపోతల పథకం
మండల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డి 

హుజూర్‌నగర్‌ , మార్చి 4: కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.2,500 కోట్లతో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్ర వారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లా డారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఏప్రిల్‌ నెలలో ఎత్తిపోతల పథకా నికి  సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయడంతో పాటు జాన్‌పహాడ్‌ దర్గాలో మొక్కులు చెల్లిస్తారన్నారు. మేళ్లచెర్వు జాతర, సోమప్ప దేవాలయానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చానన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మారుస్తానన్నారు. మఠంపల్లి మండలంలో కేంద్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసే వరిగడ్డి ఆధారిత ఇథనాల్‌ ఉత్పత్తి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మంజూరు చేసిందన్నారు.  పట్టణంలో మోడల్‌ కాలనీని పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు.   అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో  ‘మహిళాబంధు’ సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నియో జకవర్గంలో నాయకులు గ్రూపులు కడితే ఊరుకోబోనని అన్నారు.  కేసీఆర్‌ బలమైన శక్తిగా మారారని, జాతీయ రాజకీ యాలను శాసించే స్థాయి ఎదిగారన్నారు.  సమావేశంలో గెల్లి రవి, జక్కుల నాగేశ్వరరావు, కేఎల్‌ఎన్‌ రెడ్డి, కడియం వెంకటరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, పెండెం సుజాత, పార్వతి, లక్కుమళ్ల జ్యోతి, శ్రీలతారెడ్డి, రాపోలు నర్సయ్య, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌నాయక్‌, దొండపాటి అప్పిరెడ్డి, అట్లూరి హరిబాబు, నర్సింగ్‌ వెంకటేశ్వర్లు, సూరిశెట్టి బసవయ్య, మల్లికంటి దుర్గారావు, కుంట సైదులు, ఇరుగు పిచ్చయ్య, అమర్‌గౌడ్‌, భాస్కర్‌, అరవిందరెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, రామకృష్ణ, గురవయ్య పాల్గొన్నారు. 

 


Read more