టోల్‌ప్లాజా వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-04T06:12:32+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు గురువారం రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌కు చెందిన చంగంరెడ్డి శివశంకర్‌రెడ్డి, అన్నోజిగూడ రా

టోల్‌ప్లాజా వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం

బీబీనగర్‌, మార్చి 3: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు గురువారం రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఘనపూర్‌కు చెందిన చంగంరెడ్డి శివశంకర్‌రెడ్డి, అన్నోజిగూడ రాజీవ్‌ గృహకల్పకు చెందిన కుంచె మణికంఠ, పుట్ట రాజులు మూడు నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లినప్పుడు మహబూబాబాద్‌ జిల్లా కొత్తూరుకు చెందిన సతీష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. గురువారం ముగ్గురు మిత్రులు కొత్తూరు వెళ్లి సతీష్‌ నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి టీఎస్‌ 08 హెచ్‌ఎన్‌ 9905 నెంబరుగల స్కూటీపై తీసుకొస్తున్నారు. మార్గమధ్యలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు స్కూటీని తనిఖీచేసి డిక్కీలో దాచి ఉంచిన రెండు కిలోల గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపెట్టినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, ఎస్‌వోటీ రూరల్‌ ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. లక్షన్నర వరకు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.

Read more