డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

ABN , First Publish Date - 2022-11-30T02:06:43+05:30 IST

మండలంలోని రామాపురం క్రాస్‌ రోడ్డులో ఈనెల 27న నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష విధిం చినట్లు రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు.

డ్రంకెన్‌  డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

కోదాడ రూరల్‌, నవంబరు 29: మండలంలోని రామాపురం క్రాస్‌ రోడ్డులో ఈనెల 27న నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష విధిం చినట్లు రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసిన జగ్గయ్య పేటకు చెందిన బీమా ప్రసాద్‌, ముప్పాల గ్రామం చందర్లపాడు మండలానికి చెందిన కొండ్రు నాగేశ్వరరావులపై కేసు నమోదు చేశామన్నారు. నిందితులకు రెండో తరగతి న్యాయస్థానం ఎదుట మంగళవారం హాజరుపర్చగా ఇద్దరికీ రెండు రోజుల జైలు, రెండు రోజుల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సీహెచ్‌ సత్యనారాయణ తీర్పు చెప్పారన్నారు.

Updated Date - 2022-11-30T02:06:43+05:30 IST

Read more