వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-08-04T06:15:45+05:30 IST
తుర్కపల్లి, చౌటుప్పుల్ మండలాల్లో బుధవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు.
తుర్కపల్లి/ చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 3: తుర్కపల్లి, చౌటుప్పుల్ మండలాల్లో బుధవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తుర్కపల్లి మండలం రాజాపేట గ్రామానికి చెందిన గౌటె సతీష్(27), అతని బార్య చైతన్య(27), 10నెలల కుమారుడు దనూ్‌షలు ద్విచక్రవాహనంపై కుషాయగూడ మౌలాలి నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. తుర్కపల్లిలోని దాబా హోటల్ సమీపంలో తుర్కపల్లి నుంచి కుషాయగూడ వైపు వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. సతీష్ బార్య చైతన్య ట్రక్కు క్రింద పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త సతీష్, 10 నెలల కుమారుడు దనూష్ రోడ్డుపైన పడ్డారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయలకు గురైన 10నెలల బాలున్ని పోలీసులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ రమేష్ తెలిపారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామానికి చెందిన గుండెపురం శంకరయ్య(50) తాపీ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. స్థానిక శ్రీని పరిశ్రమలో పనిచేయడానికి సైకిల్‌పై వస్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో శంకరయ్య అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వాసత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సైదులు తెలిపారు.