డబ్బు సంచులతో వస్తున్నారు వారిని తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2022-10-17T06:05:48+05:30 IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారా న్ని అడ్డుపెట్టుకొని డబ్బు సంచులతో నాయకులు గ్రామాలకు వస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వారిని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పిలుపునిచ్చారు.

డబ్బు సంచులతో వస్తున్నారు వారిని తిప్పికొట్టండి
ఓటు వేయాలని మహిళలను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి


మునుగోడు,అక్టోబరు 16: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారా న్ని అడ్డుపెట్టుకొని డబ్బు సంచులతో నాయకులు గ్రామాలకు వస్తూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వారిని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పిలుపునిచ్చారు. మునుగోడు ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంతో పాటు కమ్మగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడప కూ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మహిళలకు చేతి గాజులు అం దజేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వారసురాలిగా బరిలో నిలిచిన తనను ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆదరించి ఓటు హస్తం గుర్తుకు వేసి అధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. తన గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపు అవుతుందని అన్నారు.


ప్రచారాన్ని ఉధృతం చేయాలి 

చౌటుప్పల్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారాన్ని ఉధృతం చే యాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి కోరా రు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు చేసిన సేవలను తెలిపి ఓట్లు అభ్యర్థించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రవీందర్‌, నాయకులు సైదులు, ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎస్‌కె.జాని, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:05:48+05:30 IST