అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎ్‌సకు ఓటెయ్యాలి

ABN , First Publish Date - 2022-10-17T06:04:25+05:30 IST

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ని గెలిపించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి కోరారు.

అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎ్‌సకు ఓటెయ్యాలి
శివన్నగూడలో ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

మంత్రి జగదీ్‌షరెడ్డి

మర్రిగూడ, అక్టోబరు 16: మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ని గెలిపించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మర్రిగూ డ మండలంలోని కుదాభక్షుపల్లి, శివన్నగూడ గ్రామాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. 60ఏళ్లు మునుగోడు ప్రాం తం ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడగా, మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీటిని అం దించి ఫ్లోరైడ్‌ను తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం రిజర్వాయర్లను సీ ఎం కేసీఆర్‌ నిర్మిస్తున్నారన్నారు. ఇవి పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అంది ఇక్కడి భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతామని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక రాజగోపాల్‌రెడ్డిని రూ.18వేల కోట్లతో కొనుగోలుచేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజలు రాజగోపాల్‌ను గెలిపిస్తే వారి నమ్మకాన్ని ఒమ్ముచేసి అభివృద్ధిని మరిని బీజేపీకి అమ్ముడుపోయాడన్నారు. మూడున్నరేళ్లు నియోజకవర్గాన్ని పట్టించుకోని రాజగోపాల్‌ మళ్లీ ఓట్లు వేయాలని ఎలా అడుగుతున్నాడని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు, శివన్నగూడ ఎన్నికల ఇన్‌చార్జి ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ మమతాగోపాల్‌, దేసిడి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:04:25+05:30 IST