విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ

ABN , First Publish Date - 2022-11-23T00:04:15+05:30 IST

భువనగిరి ఖిల్లాపై ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ఐదురోజుల పర్వతారోహణ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది.

విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ
భువనగిరి ఖిల్లాపై ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు

భువనగిరి టౌన్‌, నవంబరు 22: భువనగిరి ఖిల్లాపై ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ఐదురోజుల పర్వతారోహణ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 23 ఆశ్రమ పాఠశాలలనుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతుంది. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ సొసైటీ(టీఎ్‌సఈఎంఆర్‌)ఓఎ్‌సడీ కె.స్వర్ణలత శిక్షణా శిబిరా న్ని సందర్శించి మాట్లాడారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులను విభిన్న రంగాల్లో ప్రోత్సహించే లక్ష్యంతో పర్వతారోహణ శిక్షణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగు బ్యాచులలో 400 మంది విద్యార్థులకు శిక్షణ పూర్తయిందన్నారు. పర్వతారోహకులు పూర్ణ, అన్విత, ఆనం ద్‌, స్కూల్‌ కోచ్‌లు వెంకట్‌, రాకేష్‌ తదితరుల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోంది.

Updated Date - 2022-11-23T00:04:18+05:30 IST