పండుగ పూట విషాదం

ABN , First Publish Date - 2022-10-07T05:40:16+05:30 IST

దసరా పండు గ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు సాగర్‌ ఎడమ కాల్వలో గల్లంతయ్యా డు.

పండుగ పూట విషాదం
షేక్‌ సాజిద్‌

సాగర్‌ ఎడమకాల్వలో వేర్వేరు చోట్ల ఇద్దరు గల్లంతు 

 విద్యుదాఘాతంతో రైతు మృతి

నిడమనూరు, అక్టోబరు 6: దసరా పండు గ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు సాగర్‌ ఎడమ కాల్వలో గల్లంతయ్యా డు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో గురువారం  ఈ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నా యి. పెద్దవూర మండలం నాయనివానికుంట గ్రామానికి చెందిన మేకల బ్రహ్మయ్యకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మేకల వెంకట్‌ (10) నాగార్జునసాగర్‌లోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో నిడమనూరు మండ లం ముప్పారంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ వద్ద దుస్తులు ఉతికేందుకు అమ్మమ్మ మర్రి లక్ష్మమ్మ వెంట వెంకట్‌ వెళ్లాడు. లక్ష్మమ్మ దుస్తులు ఉతుకుతుండగా కాల్వ ఒడ్డున కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. కళ్ల ముందే మనుమడు నీటిలో కొట్టుకుపోతుండటం చూసి లక్ష్మమ్మ కేకలు వేయగా కొందరు వచ్చి వెతికినా బాలు డి ఆచూకీ కనిపించలేదు. కాల్వలో 14అడుగుల మేరకు నీటి ప్రవాహం ఉంది. సెలవులకు ఇంటికి వచ్చిన మనవడు కాల్వలో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి తండ్రి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు.

వేములపల్లిలో

వేములపల్లి, అక్టోబరు 6: చేపల వేటకు వెళ్లిన యువకుడు సాగర్‌ ఎడమకాల్వలో పడి గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో గురువారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేములపల్లికి చెందిన షేక్‌ పాషా, ఫాతిమా దంపతుల ఏకైక కుమారుడైన షేక్‌ సాజిద్‌ (22) గురువారం మధ్యాహ్నం గాలంతో చేపలు పట్టేందుకు సాగర్‌ ఎడమకాల్వ వద్దకు వెళ్లాడు. ఎడమ కాల్వ వంతెన సమీపంలో ఉన్న మెట్లపై నిలబడి గాలంతో చేపలు పడుతూ కాలుజారి కా ల్వలో పడిపోయాడు. సాజిద్‌ కాల్వలో మునుగుతుండగా అదే సమయానికి దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సాగర్‌ ఎడమకాల్వ వద్దకు వచ్చిన స్థానికులు కేకలు వేస్తుండగానే గల్లంతయ్యాడు. దీంతో సమాచారం అందుకున్న సాజిద్‌ తల్లిదండ్రులు బ్రిడ్జి సమీపంలోని మెట్ల వద్దకు వచ్చి చూడగా అక్కడ ఉన్న చెప్పులు తమ కుమారుడివేనని గుర్తించారు. దీంతో సాజిద్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహం కోసం పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు కొనసాగుతోంది. 

గడ్డి కోసేందుకు వెళ్లి మృత్యువాత

నడిగూడెం, అక్టోబరు 6: గడ్డి కోసేందుకు వెళ్లిన రైతు విద్యుదా ఘాతంతో మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మొగిలిచర్ల రైతు నర్సయ్య(40)కు గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉంది. గురువారం ఉదయం పొలం గట్టుపై గడ్డి కోసేందుకు వెళ్లి గట్టుపై ఉన్న విద్యుత వైర్లు తగిలి మృతిచెందాడు. నర్సయ్యకు భార్య మమత, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బావిలో పడి వృద్ధుడు

పెనపహాడ్‌, అక్టోబరు 6:బావిలో పడి వ్యక్తి మృతిచెందాడు. సూర్యా పేట జిల్లా పెనపహాడ్‌ మండలం మేగ్యాతండాలో గురువారం ఈ సంఘటన జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన భూక్య గోలియా(60) దసరా పండగ సంద ర్భంగా బుధవారం రోజు మద్యం తాగి రోజుంతా తండాలో తిరిగాడు. రాత్రి సమయంలో గోలియా ఇంటికి రాలేదు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గోలియా కోసం వెతికారు. గ్రామ శివారు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో గోలియా శవమై తేలాడు. గోలియాకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

బైక్‌ పైనుంచి పడి యువకుడి మృతి

గుండాల, అక్టోబరు 6: బైక్‌పైనుంచి పడి యువకుడు మృతి చెందా డు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వంగాల గ్రామ శివారులో బుధవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. వంగాల గ్రామానికి చెందిన చిప్పలపల్లి రాజు(30) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. దసరాకు బుధవారం వంగాలకు వచ్చి తన అత్తగారిల్లు అయిన మండలంలోని గంగాపురానికి అతని బామ్మర్ది అ ల్వాల పరశురాములుతో కలిసి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వర్షం కురు స్తుండడంతో రోడ్డుపై అదుపు తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. వెనకాల కూర్చున్న రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజు సోదరుడు సోమనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ప్రకాష్‌ తెలిపారు.  

తాటి చెట్టు పై నుంచి పడి గీతకార్మిడు మృతి 

ఆత్మకూరు(ఎం), అక్ట్టోబరు 6: పారుపల్లి గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్‌(53) అనే గీతకార్మికుడు గురువారం ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. శ్రీనివాస్‌ రోజువారీగా తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారడంతో చెట్టుపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి, పోస్టుమార్టంకోసం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ జి.మధు తెలిపారు.  

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

మోత్కూరు, అక్టోబరు 6: మోత్కూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలతోపాటు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మోత్కూరుకు చెందిన ఆకుల యాకయ్య, భార్య లక్ష్మీ, పిల్లలు నికిత, విశేష్‌ బైక్‌పై తమ ఇంటికి వెళుతుండగా హెచపీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో మోత్కూరు నుంచి నల్లగొండ వైపు వెళుతున్న గుర్తు తెలియని కారు వేగంగా బైక్‌నుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకయ్య, భార్యాపిల్లలు గాయపడ్డారు. అతి వేగంగా, అజాగ్రత్తగా కారు నడుపుతున్న కారు డ్రైవర్‌ కారు ఆపకుండా వెళ్లిపోయాడు. యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఫ రాజన్నగూడెం సమీపాన రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న బాషబోయిన మల్లేష్‌ను బుధవారం సాయంత్రం మోత్కూరు నుంచి హైద రాబాదు వైపు వెళుతున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో మల్లేష్‌ తీవ్ర ంగా గాయపడ్డాడని ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపారు. రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-10-07T05:40:16+05:30 IST