సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగించిన 18మందికి వ్యాపారులకు జరిమానా

ABN , First Publish Date - 2022-09-13T05:51:11+05:30 IST

నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగిస్తున్న భువనగిరిలోని దుకాణాలపై మునిసిపల్‌ అధికారులు కొరడా ఝుళిపించారు.

సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగించిన 18మందికి వ్యాపారులకు జరిమానా
దుకాణ యజమానికి వస్త్ర సంచులను అందిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి

భువనగిరి టౌన, సెప్టెంబరు 12: నిషేధిత సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగిస్తున్న భువనగిరిలోని దుకాణాలపై మునిసిపల్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. కమిషనర్‌ బి.నాగిరెడ్డి నేతృత్వంలోని మునిసిపల్‌ బృందం సోమవారం ఏకంగా 45 దుకాణాల్లో తనిఖీలు చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగింస్తున్న 18 మంది యజమానులను గుర్తించి రూ.13,800 జరిమానా విధించారు. అదే సమయంలో మునిసిపల్‌ మెప్మా ఆఽధ్వర్యంలోని మహిళా సంఘాలు కుట్టిన వెయ్యి వస్త్ర బ్యాగులను ఒక్కటి రూ.10 చొప్పున సంబంధిత యజమానులతో కొనుగోలు చేయించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం వస్త్ర సంచులనే వాడాలని, ముందస్తు ఆర్డర్‌తో మహిళా సంఘాల నుంచి సంచులను కొనుగోలు చేయవచ్చునని కమిషనర్‌ సూచించారు.  


Updated Date - 2022-09-13T05:51:11+05:30 IST