సాగర్‌లో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2022-04-24T05:36:18+05:30 IST

పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంకావడంతో శనివారం ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది.

సాగర్‌లో పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 23: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభంకావడంతో శనివారం ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాలనుంచి సాగర్‌ అందాలను తిలకించేందుకు పర్యాటకులు సాగర్‌కు తరలివచ్చారు. దీంతో సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల తదితర ప్రాంతాలల్లో పర్యాటకులు సందడిచేశారు. హిల్‌కాలనీ డౌన్‌ పార్కు వద్ద ఉన్న లాంచీ స్టేషన్‌నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు ఒక లాంచీ ట్రిప్పు సూర్యాపేట జిల్లాకు చెందిన పాఠశాల విద్యార్థులతో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. 

Read more