ముగిసిన తిరునక్షత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-02T05:25:52+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు మూడో రోజైన సోమ వారం ముగిశాయి.

ముగిసిన తిరునక్షత్రోత్సవాలు
నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

స్వామి నిత్యాదాయం రూ.32.34లక్షలు 

యాదగిరిగుట్ట, ఆగస్టు 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు మూడో రోజైన సోమ వారం ముగిశాయి. కొండపైన ప్రధానాలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయం లో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారికి అర్చకస్వాములు వేదమంత్ర పఠనా లు,మంగళవాయిద్యాల నడుమ అభిషేకించారు.దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్ది సేవోత్సవం నిర్వహించారు.ప్రధానాలయంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి దివ్యప్రబంధ వేదపఠనం జరిపారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో మూడు రోజుల పాటు అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు నిర్వహించడం ఆలయ సంప్రదాయమని దేవస్థాన ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. లక్ష్మీనృసింహుడికి, కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యపూజలు,కొండపైన ప్రధానాలయ అష్టభు జి ఈశాన్య ప్రాకార మండపంలో కోటి కుంకుమార్చన పూజలు సంప్రదా యరీతిలో నిర్వహించారు.శ్రావణమాసం కావడంతో భక్తులు హరిహరుల ను దర్శించుకుని ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నా రు. భక్తులతో తిరువీధులు, సేవా మం డపాలు, దర్శన క్యూలైన్లలో సందడి వాతావరణం నెలకొంది.ఆలయ ఖజానాకు వివిధ విభాగాలద్వారా రూ.32, 34,744 ఆదాయం సమకూరిందని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు.


నృసింహుడి అభిషేకం పీఠానికి 5వేల డాలర్ల విరాళం

గుట్ట లక్ష్మీనృసింహుడి దేవస్థానంలో అభిషేక పీఠం కోసం ప్రవాస భారతీయుడు, శ్రీరామా జయనికేతన్‌ ప్రధానకార్యదర్శి దుర్గాప్రసాద్‌ ఐదు వేల అమెరికన్‌ డాలర్ల చెక్కును(సుమారు రూ4లక్షలు) విరాళంగా అందజేశా రు.సోమవారం ఆయన యాదగిరిగుట్టను సందర్శించి ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకున్నారు. అనంతరం ముఖమండపంలో విరా ళం చెక్కును ఈవో గీతారెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకబృందం దాత కు ఆశీర్వచనం జరపగా, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దాత దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన తాను అమెరి కా టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌సిటీలో స్థిరపడ్డానని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనృసింహుడి భక్తుడిని కావటంతో అక్కడ రెండు మి లియన్‌ డాలర్లతో(సుమారు రూ.16కోట్లు) లక్ష్మీనృసింహుడి ఆలయాన్ని నిర్మి స్తున్నట్లు తెలిపా రు. శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం స్వా మికి నిత్యపూజలు నిర్వహించనున్నామని, ఆలయ నిర్మాణం త్వరలో పూర్తి కానున్నదన్నారు.

Updated Date - 2022-08-02T05:25:52+05:30 IST