అంగన్‌వాడీలపై పని భారం సరికాదు

ABN , First Publish Date - 2022-10-17T06:04:43+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ టీచర్లతో చేయిస్తూ పనిభారం మోపుతున్నారని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు.

అంగన్‌వాడీలపై పని భారం సరికాదు
మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి

భువనగిరి టౌన్‌, అక్టోబరు 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ టీచర్లతో చేయిస్తూ పనిభారం మోపుతున్నారని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. భువనగిరిలో ఆదివారం జరిగిన అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా 3వ మహాసభలో మాట్లాడారు. అంగన్‌వాడీ వ్యవస్థకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ టీచర్లను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల పోస్టుల నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.  నవంబర్‌ 20, 21వ తేదీల్లో భువనగిరిలో అంగన్‌వాడీల రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి సిలివేరు రమాకుమారి, బూరుగు స్వప్న, ఏనుగుల పద్మ, రుక్మిణి, కళ్యాణి, బోడ భాగ్య, సరిత, శోభ, సునీత, అన్నపూర్ణ, ప్రమిల, సరోజ, అనిత, పావని, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T06:04:43+05:30 IST