స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-01-03T05:38:45+05:30 IST

త్వరలో జరిగే స్వరాజ్య పాదయాత్రలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డీఎస్పీ జెండా అండగా ఉంటుందని అన్నారు. మండలంలోని కోతులపురం గ్రామంలో డీఎస్పీ జెండాను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మొత్తం డీఎస్పీ ఉద్యమాన్ని అ

స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేయాలి
సంస్థాన్‌ నారాయణపురంలో జెండా ఆవిష్కరిస్తున్న విశారదన్‌ మహారాజ్‌

సంస్థాన్‌ నారాయణపురం జనవరి 2: త్వరలో జరిగే స్వరాజ్య పాదయాత్రలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డీఎస్పీ జెండా అండగా ఉంటుందని అన్నారు. మండలంలోని కోతులపురం గ్రామంలో డీఎస్పీ జెండాను ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మొత్తం డీఎస్పీ ఉద్యమాన్ని అర్థం చేసుకొని ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ యాదవ్‌రాజు, జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ మండల అధ్యక్షడు సంజీవ తదితరులు పాల్గొన్నారు. 

చౌటుప్పల్‌ టౌన్‌: బహుజనుల హక్కుల రక్షణకు ఆవిర్భవించిన దళిత శక్తి పోగ్రాం సంస్థకు ప్రజాదరణ పెరుగుతుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు విషారదన్‌ అన్నారు. దళిత శక్తి పోగ్రామ్‌ జెండా పండుగను చౌటుప్పల్‌ పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్య స్థాపన చేయడమే ద్యేయంగా ముందుకు వెలుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T05:38:45+05:30 IST