రైతుల్లో ‘సర్వే’ కలవరం

ABN , First Publish Date - 2022-12-15T00:15:35+05:30 IST

వారంతా ఏళ్ల తరబడి పోడుభూములను సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి అటవీ భూముల్లో సాగు చేయనీయకుండా అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వి అడ్డుకున్నారు. సాగు చేయడానికి వెళ్తే రైతుల ట్రాక్టర్లను సీజ్‌చేసి కేసులు నమోదు చేసిన ఘటనలూ ఉన్నాయి.

రైతుల్లో ‘సర్వే’ కలవరం
సర్వే చేస్తున్న ఫారెస్టు, రెవెన్యూ అధికారులు.

పెద్దఅడిశర్లపల్లి, డిసెంబరు 14: వారంతా ఏళ్ల తరబడి పోడుభూములను సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి అటవీ భూముల్లో సాగు చేయనీయకుండా అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వి అడ్డుకున్నారు. సాగు చేయడానికి వెళ్తే రైతుల ట్రాక్టర్లను సీజ్‌చేసి కేసులు నమోదు చేసిన ఘటనలూ ఉన్నాయి. అటవీశాఖ అధికారులు వేసిన కేసులతో భయందోళన చెందిన రైతులు అటువైపుగా వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు జారీ చేస్తామని ప్రకటించడంతో ఆశలు చిగురించాయి. పోడు హక్కుపత్రాలు ఇవ్వాలని మండలంలో 2,550 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే చేస్తున్న అధికారులకు వచ్చిన మార్గదర్శకాల్లో రైతులు సాగులో ఉంటేనే నమోదు చేయాలని సూచించడంతో కలవరం మొదలైంది. సాగులో ఎవరూ లేకపోవడంతో అధికారులకు జారీ చేసిన యాప్‌ ద్వారా ఫొటో తీస్తే బీడు భూమిగా ఉండడంతో.. సాగులో ఎవరూ లేరని యాప్‌లో నమోదవుతుంది. మండలంలోని రైతులు ఏళ్లుగా సాగు చేసుకున్న తమకు పోడు భూమి పట్టాలు వస్తాయో రావోనన్న భయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-12-15T00:15:36+05:30 IST