పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-06-26T06:37:57+05:30 IST
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాలుగో విడత పట్టణ ప్రగతి, ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన సిబ్బందిని ఆమె సన్మానించారు.
కలెక్టర్ పమేలాసత్పథి
భువనగిరి రూరల్, జూన్25: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నాలుగో విడత పట్టణ ప్రగతి, ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన సిబ్బందిని ఆమె సన్మానించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో 28లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్ తివారీ, తదితరులు పాల్గొన్నారు.