భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-04T05:41:40+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రోషపతి కోరారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

హుజూర్‌నగర్‌, ఆగస్టు 3: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను  పరిష్కరిం చాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యల్క సోమయ్యగౌడ్‌,  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రోషపతి కోరారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో వారు మాట్లాడారు.  అసంఘటితరంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి చలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. కార్యక్రమంలో బాలశౌరిరెడ్డి, రామకృష్ణ, ముస్తఫా, నరేష్‌, మల్లేష్‌, వీరస్వామి, శాంతయ్య పాల్గొన్నారు.



Updated Date - 2022-08-04T05:41:40+05:30 IST