అధికారుల తీరుపై ఎమ్మెల్సీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-10-02T06:26:57+05:30 IST

మండల సర్వసభ్య సమావే శం గరంగరంగా సాగింది. శనివారం ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి అ ధ్యక్షతన శనివారం నిర్వహించిన మండ ల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరై మాట్లాడారు.

అధికారుల తీరుపై ఎమ్మెల్సీ ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి

పెద్దవూర, అ క్టోబరు 1: మండల సర్వసభ్య సమావే శం గరంగరంగా సాగింది. శనివారం ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి అ ధ్యక్షతన శనివారం నిర్వహించిన మండ ల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాజరై మాట్లాడారు. ప్రొటోకాల్‌ నిబంధనలను సరిగా పాటించకపోవడంపై అధికారులను నిలదీసి ఆగ్రహం వ్య క్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం అందించకపోవ డం, విద్యుతశాఖ ఏఈతో పాటు పలువురు అధికారుల గైర్హాజర్‌పై స మాచారం అందించలేదా ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. అధికారు లు ప్రజాప్రతినిధులను గౌరవించాలన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్యామ్‌, వైస్‌ ఎంపీపీ వివేక్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


Read more