వివేకానందుడి జీవితం స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2022-01-13T06:23:24+05:30 IST
స్వామి వేవేకానందుడి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు యువజన సంఘాల నాయకులు కొనియాడారు.
భువనగిరి రూరల్/ భువనగిరి టౌన, జనవరి 12: స్వామి వేవేకానందుడి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు యువజన సంఘాల నాయకులు కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా స్వామి వేవేకానందుడి జయంతిని బుధవారం నిర్వహించారు. వివేకానందుడి విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద స్పూర్తిని నేటి యువత కొనసాగించాలని కలెక్టర్ పమేలా సత్పథి అన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను పురస్కరించుకొని భువనగిరిలో ఆమె వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మునిసిపల్ చైర్మన ఎనబోయిన అంజనేయులు, యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు జిట్ట బాలకృష్ణారెడ్డి, తదితర ప్రముఖులు స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఏబివీపీ, బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్, హిందూ వాహిని, యూత కాంగ్రెస్, ఎనఎ్‌సయూఐ ఆధ్వర్యంలో వేర్వేరుగా నివాళులు అర్పించారు. భువనగిరి శివారులోని రాయిగిరిలో గల సహృదయ వృద్ద అనాథాశ్రమంలో యువజన సంఘం సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె.ధనుంజయ్‌లు, అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్, బొజ్జ ఎల్లేశ, పాల్త్యా హనుమంతు, గడ్డమీది శేఖర్, కమలాకర్, చంద్రం, నాగేందర్ తదితరులున్నారు. అదే విధంగా వీరవెల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ కల్పన, ఎంపీటీసీ లలిత,వేమన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డినాయక్ తండాలో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన, సర్పంచ మంజీనాయక్, నరేశ నాయక్ పాల్గొన్నారు.