సమీకృత మార్కెట్‌ను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-12-16T01:47:50+05:30 IST

చండూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు నిర్ణయాన్ని మానుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

సమీకృత మార్కెట్‌ను ఉపసంహరించుకోవాలి
చండూరు చౌరస్తాలో ధర్నా చేస్తున్న విద్యార్థులు

రోడ్డెక్కిన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు

చండూరు, డిసెంబరు 15: చండూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు నిర్ణయాన్ని మానుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌ను వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించి పాఠశాలను బంద్‌ చేశారు. మార్కెట్‌ ఏర్పాటును విరమించుకోవాలని మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటమణికరణ్‌కు ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగెల వెంకటేష్‌, బీజేవైఎం స్టడీసర్కిల్‌ రాష్ట్ర కన్వీనర్‌ భూతరాజు శ్రీహరి వేర్వేరుగా మాట్లాడుతూ, చండూరు హైస్కూల్లో సమీకృత మార్కెట్‌కు స్థలాన్ని కేటాయిస్తే భవిష్యత్తులో విద్యార్థులకు మైదానం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మాంసం, కూరగాయల దుకాణాలతో విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతుందన్నారు. తక్షణమే మార్కెట్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చారించారు. అదేవిధంగా మార్కెట్‌ నిర్ణయాన్ని విరమించుకోవాలని హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు తహసీల్దార్‌ గణే్‌షకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమాల్లో ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు కురుపాటి పరమేష్‌, గడ్డం నవీన్‌, ఇరిగి ప్రవీణ్‌, హరికృష్ణ, బీజేవైఎం నాయకులు పేర్ల గణేష్‌, సోమ శంకర్‌, బొబ్బిలి శివ, కారింగు సాయి, దోటి శివ, హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు మంచుకొండ సంజయ్‌, పన్నాల లింగయ్య, గండూరి నర్సింహ, వడ్డెపల్లి భాస్కర్‌, పన్నాల శ్యామ్‌, రవితేజ, రాజు, వేణు, మహేష్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

కళాశాల స్థలంలో మార్కెట్‌ వద్దు

దేవరకొండ: దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల స్థలంలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలమల గోపిచందర్‌, జిల్లా కన్వీనర్‌ ఆవుల సంపత్‌ డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఎదుట రోడ్డుపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో మార్కెట్‌ నిర్మిస్తే విద్యార్థుల క్రీడలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. విషయం తెలుసుకున్న దేవరకొండ సీఐ శ్రీనివాస్‌ విద్యార్థులకు నచ్చచెప్పడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌, అనిల్‌, మధు, మోతిలాల్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:47:52+05:30 IST