గిరిజనుల రిజర్వేషన్ల పెంపు హర్షణీయం

ABN , First Publish Date - 2022-10-02T05:50:00+05:30 IST

ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం హర్షణీయమని లంబాడి విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు బానోతు హరీ్‌షనాయక్‌ అన్నారు.

గిరిజనుల రిజర్వేషన్ల పెంపు హర్షణీయం
సూర్యాపేటలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న గిరిజన నేతలు

సూర్యాపేట టౌన్‌ / అనంతగిరి / కోదాడ టౌన్‌ / మఠం పల్లి, అక్టోబరు 1 : ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం హర్షణీయమని లంబాడి విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు బానోతు హరీ్‌షనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మంక్రా్‌సరోడ్డు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. అన్ని  ప్రభుత్వ కార్యాలయాల్లో జీవో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు సుమన్‌నాయక్‌, నియోజకవర్గ అధ్యక్షుడు బానోతు నర్సింహానాయక్‌, సేవాలాల్‌నాయక్‌, సిద్దునాయక్‌, సపావత్‌ లోకే్‌షనాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మంక్రా్‌సరోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిక్షంనాయక్‌, లచ్చిరాంనాయక్‌, కిషన్‌నాయక్‌, బికారినాయక్‌, సురేందర్‌నాయక్‌, నాగేందర్‌నాయక్‌, మంగ్తనాయక్‌ పాల్గొన్నారు. అనంతగిరి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు గుగులోతు శ్రీనివా్‌సనాయక్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల సమన్వయ సమితి కమిటీ సభ్యుడు మట్టపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, హనుమంతు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు అజ్మిరా బుజ్జి శ్రీనివాస్‌, భూక్యా లలితా శ్రీను బాబు, ఉపసర్పంచ్‌ భూక్యా నాగరాజు, మండల ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు భూక్య నాగరాజు, జాయింట్‌ కార్యదర్శి ధరావత్‌ రామకృష్ణ, పానుగోతు భార్గవ్‌నాయక్‌, తులసిరామ్‌, మాలోతు ఉదయ్‌కుమార్‌, సుబ్బారావు, తరుణ్‌, వెంకటేష్‌, గ్రామశాఖ అధ్యక్షుడు బానోతు వెంకటేశ్వర్లు, తేజావత్‌ వీరన్న, గోవిందు పాల్గొన్నారు. కోదాడలో గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐక్య గిరిజన సంఘాల నాయకులు హజీనాయక్‌, మాలోతు సైదా నాయక్‌, భూక్యా హనుమానాయక్‌, బట్టు శివాజీ నాయక్‌, బావాసింగ్‌, వెంకటేశ్వర్లు, రఘు, రాజు, నందులాల్‌, చైతన్య, పాలితియా, పద్మ, కనకమ్మ, రవినాయక్‌, శ్రీనివాస్‌, శంకర్‌నాయక్‌, రాంప్రసాద్‌, గాంధీ పాల్గొన్నారు. మఠంపల్లి మండలం లాలితండాలో సేవాలాల్‌ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.  కార్యక్రమంలో సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బానోతు బాతునాయక్‌, నాయకులు రవీందర్‌, మట్టపల్లి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీఎం నిర్ణయాన్ని ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్లావతు బాలాజీనాయక్‌ హర్షం వ్యక్తం చేశారు. Read more