తెలంగాణ చరిత్రను వక్రీకరించారు

ABN , First Publish Date - 2022-09-12T05:08:51+05:30 IST

నిజాం పాలనకు ముం దే తెలంగాణలోని ఎనిమిది జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయ నే నిజాన్ని నాటి చరిత్రకారులు వక్రీకరించారని నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల రాష్ట్ర కన్వీనర్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర ప్రచార క్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ చరిత్రను వక్రీకరించారు
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీధర్‌రెడ్డి

ఏడాదిపాటు తెలంగాణ అమృతోత్సవాలు 

 ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర ప్రచారక్‌ శ్రీధర్‌రెడ్డి 

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 11: నిజాం పాలనకు ముం దే తెలంగాణలోని ఎనిమిది జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయ నే నిజాన్ని నాటి చరిత్రకారులు వక్రీకరించారని నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల రాష్ట్ర కన్వీనర్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర ప్రచార క్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన అమృతోత్సవాల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో  25శాతం భూములు ఆయన పేరిట, 25శాతం భూములు ఆయన అనుచరుల కబ్జాలో ఉండేవని, మిగతా 50 శాతం భూములను ప్రజలు సాగు చేసుకున్నప్పటికీ వివిఽధరూపాల్లో కప్పం వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించాడన్నారు. కాకతీయులు, శాతవాహనులు, తదితర రాజుల పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. నైజాం పాలన విముక్తికోసం ఆర్యసమాజ్‌, తదితర సంస్థల ఆఽధ్వర్యంలో పలు పోరాటాలు, త్యాగాలు పూర్తిస్థాయిలో చరిత్రపుటల్లోకి ఎక్కలేదన్నారు. 


కమ్యూనిస్టుల ప్రచారంలో వాస్తవం లేదు 

సాయుధ పోరాటాలతోనే నైజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని కమ్యూనిస్టులు చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీధర్‌రెడ్డి అన్నారు. నిజానిజాలను తెలిపేందుకు రజాకార్‌ ఫైల్స్‌, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌ కథ సమకూరుస్తున్న మరో నాలుగు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయన్నారు. తెలంగాణ అమృతోత్సవాలను ఈ నెల 17 నుంచి ఏడాదిపాటు తెలంగాణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడాదిపాటు సాగనున్న అమృతోత్సవాల నిర్వహణకు రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా విశ్రాంత ఏసీపీ బొట్టు కృష్ణ, ఉపాధ్యక్షులుగా ఆరుట్ల సుశీలాదేవి, పడాల చంద్రం, పులిమామిడి సుభా్‌షరెడ్డి, కందుల శంకర్‌, ఊట్కూరి దామోదర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా రచ్చ సురేష్‌ ఎన్నికయ్యారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొట్టు కృష్ణ, ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా సంఘ్‌ చాలక్‌ బాదం ప్రకాశ్‌, బేతి కన్నయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-12T05:08:51+05:30 IST