మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-30T06:31:32+05:30 IST

గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనే ప్ర భుత్వ ధ్యేయమని ఎ మ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు.

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
ఈదులూరులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

కట్టంగూరు, మే 29: గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనే ప్ర భుత్వ ధ్యేయమని ఎ మ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు, పందెనపల్లి గ్రామాల్లో నిర్మిం చే సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, ఏడుకొండలు, ఎంపీడీవో సునీత, ఎంపీవో ఫర్వేజ్‌, ఎంపీటీసీ భవాని, నకిరేకంటి నర్సింహ,  యాదయ్య, శ్రీను, నరేష్‌, నాగమణి పాల్గొన్నారు. 

Read more