రైతు వ్యతిరేక విధానాలతో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం

ABN , First Publish Date - 2022-03-05T06:32:54+05:30 IST

రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేవని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పతనమవ్వడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలతో టీఆర్‌ఎస్‌ పతనం ఖాయం
నిదాన్‌పల్లి గ్రామంలో మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రామన్నపేట, మార్చి 4: రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేవని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పతనమవ్వడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని నిదాన్‌పల్లి గ్రామంలో మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూజ ల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ,  కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని చేప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. అవసరమైతే రైతు బంధు పథకం నిలిపివేసైనా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చే యాలని డిమాండ్‌ చేశారు. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైస్‌ మిల్లులు ధాన్యాన్ని కోనుగోలు చేయకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయాల ని, దీనిపై కేసీఆర్‌ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాం డ్‌ చేశారు. ఈ ప్రాంతంలో వరి తప్ప ఇతర పంటలు పండ వన్నారు. చత్తీ్‌సఘడ్‌లో రైతులు పండించిన ధాన్యానికి అక్కడి ప్రభుత్వం బోనస్‌ ప్రకటిస్తే, తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ ప్రాంతంలో మూసీ, ఇతర కాల్వలు ఉడడంతో రైతులు వరి సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు దైద రవీందర్‌, శ్రీవివాస్‌ రెడ్డి, మల్లారెడ్డి, హర్షిణిచంద్రశేఖర్‌, సుధీర్‌బాబు, రవి, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:32:54+05:30 IST