డబుల్ బెడ్‌రూం పథకం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2022-05-29T06:24:02+05:30 IST
డబుల్ బెడ్‌రూం పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అన్నారు.

70 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవీంద్ర
దేవరకొండ, మే 28: డబుల్ బెడ్‌రూం పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలో 25, దేవరకొండ మండలం కొండభీమనపల్లి 25, డిండి మండలం కందుకూరు 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేవిధంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు ని ర్మించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపి రాం, మార్కెట్ కమిటీ చైర్మన శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీలు జానయాదవ్, మాధవరం సునీతజనార్ధనరావు, పార్వతి, జ డ్పీటీసీ మారుపాకల అరుణ సురే్‌షగౌడ్, చింతపల్లి సుభాష్, గోసు ల కవిత అనంతగిరి, ఎంపీటీసీ వెంకటమ్మ, వెంకటచారి, తహసీల్దార్ ప్రశాంత, అ ధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుంది
నాంపల్లి మండలం కేతేపల్లిలో జరిగిన విద్యుత ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుందని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుం బసభ్యులను పరామర్శించి ఓదార్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు.