స్వదేశానికి చేరుకున్న మృతదేహం

ABN , First Publish Date - 2022-10-07T05:49:23+05:30 IST

ప్రేమ విఫలమై గత నెల 29వ తేదీన లం డనలోని బర్మింగ్‌ హోం లో బలవన్మరణానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం దొండపా డు గ్రామానికి చెందిన సాయిమోహన రెడ్డి మృతదేహం గురువారం స్వదేశానికి తీసుకు వచ్చారు.

స్వదేశానికి చేరుకున్న మృతదేహం
సాయిమోహనరెడ్డి (ఫైల్‌)

మేళ్లచెర్వు, అక్టోబరు 6:  ప్రేమ విఫలమై గత నెల 29వ తేదీన లం డనలోని బర్మింగ్‌ హోం లో బలవన్మరణానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండలం దొండపా డు గ్రామానికి చెందిన సాయిమోహన రెడ్డి మృతదేహం గురువారం స్వదేశానికి తీసుకు వచ్చారు. ప్రత్యేక విమా నంలో గురువారం రాత్రి హైదరాబాద్‌ విమానాశ్రయా నికి తీసుకు వచ్చినట్లు సాయిమోహనరెడ్డి తల్లిదండ్రులు అన్నపురెడ్డి కనకారెడ్డి, కవిత తెలిపారు. శుక్రవారం స్వగ్రా మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తెలిపారు. 


Read more