సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆందోళన

ABN , First Publish Date - 2022-08-18T05:44:01+05:30 IST

దేవరకొండ ప్రభుత్వ ఆ స్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శి శువు మృతి చెందాడని బాధితులు బుధవారం ఆందోళన చేశారు.

సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని ఆందోళన
సూపరింటెండెంట్‌ టేబుల్‌పై శిశువు మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యుల నిరసన

దేవరకొండ, ఆగస్టు 17: దేవరకొండ ప్రభుత్వ ఆ స్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శి శువు మృతి చెందాడని బాధితులు బుధవారం ఆందోళన చేశారు. స్థానికుల వివరా ప్ర కారం దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన మండే ధనమ్మ మొ దటి కాన్పు కోసం ఈ నెల 13న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు కాన్పు చేయగా ఆ డపిల్లకు జన్మనిచ్చింది. ఆడశిశువు ఆనారోగ్యంగా ఉండడంతో హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు బుధవారం మృతి చెందింది. శిశువు మృతికి దేవరకొండ ప్రభుత్వ నర్సులే కారణం అంటే ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్‌ రాములునాయక్‌ టేబుల్‌పై శిశువు మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. శిశువు మృతికి కారణమైన నర్సులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బిజేపీ నాయకులు డిమాండ్‌ చేశా రు. అనంతరం సూపరింటెండెంట్‌ రాములునాయక్‌, పట్టణ సీఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీఽసుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు. కార్యక్రంలో బీజేపీ నాయకులు గుండా ల అంజయ్య, అంకూరి నర్సింహ, వస్కుల సుధాకర్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-18T05:44:01+05:30 IST