గల్లంతైన గోపిచంద్ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-03-01T07:20:59+05:30 IST
తల్లి చేతిలో సాగర్ ఎడమ కాల్వలోకి నెట్టివేసిన బాలుడి మృతదేహం లభ్యమైంది.
వేములపల్లి, ఫిబ్రవరి 28: తల్లి చేతిలో సాగర్ ఎడమ కాల్వలోకి నెట్టివేసిన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 26న మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల శైలజ తన కుమారుడు గోపిచంద్‌ను సాగర్ ఎడమకాల్వలోకి తోసివేసింది. అక్కడ గల్లంతైన గో పిచంద్ పెనపహాడ్ మండలం దోసపహాడ్ వంతెన వద్ద మృతదేహాన్ని గుర్తించామ ని తెలిపారు. మృతదేహానికి పంచనామా అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి లో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.