దాడిచేసిన వ్యక్తి అరెస్ట్‌, రిమాండ్‌

ABN , First Publish Date - 2022-03-05T06:21:49+05:30 IST

మండల పరిధిలోని నిదాన్‌పల్లి గ్రామశివారులో ఈనెల 3న మల్లన్నగుట్ట జాతరలో తుమ్మలగూడెం గ్రామానికి చెందిన సింగనబోయిన మధు, సింగనబోయిన మల్లేష్‌ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య తెలిపారు.

దాడిచేసిన వ్యక్తి అరెస్ట్‌, రిమాండ్‌


రామన్నపేట, మార్చి 4 :  మండల పరిధిలోని నిదాన్‌పల్లి గ్రామశివారులో ఈనెల 3న మల్లన్నగుట్ట జాతరలో తుమ్మలగూడెం గ్రామానికి చెందిన సింగనబోయిన మధు, సింగనబోయిన మల్లేష్‌ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మలగూడెం గ్రామానికి చెందిన చెందిన సింగనబోయిన మధు, సింగనబోయిన మల్లే్‌షలకు బోనగిరి సాయికుమార్‌కు మధ్య గత కొంత కాలంగా వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. దీంతో కక్ష పెంచుకున్న సాయికుమార్‌ ఈనెల  3న రాత్రి మండల పరిధిలోని నిదాన్‌పల్లి గ్రామశివారులో మల్లన్నగుట్ట జాతరలో  అతడి స్నేహితులతో కలిసి  కత్తితో దాడి చేసి, గాయపర్చాడు. గాయపడిన వీరిని హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సింగనబోయిన మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Read more