తెలంగాణ మోడల్‌ సర్కార్‌ అంటే అహంకారం, అప్పు, అవినీతి

ABN , First Publish Date - 2022-12-12T23:23:59+05:30 IST

తెలంగాణ మోడల్‌ సర్కార్‌ అంటే సీఎం కేసీఆర్‌ అవినీతి, అప్పు, అహంకారం అని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ మోడల్‌ సర్కార్‌ అంటే  అహంకారం, అప్పు, అవినీతి
హుజూర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బూర నర్సయ్యగౌడ్‌

హుజూర్‌నగర్‌ / మఠంపల్లి, డిసెంబరు 12: తెలంగాణ మోడల్‌ సర్కార్‌ అంటే సీఎం కేసీఆర్‌ అవినీతి, అప్పు, అహంకారం అని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు నమ్మడంలేదని, దేశ ప్రజలను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్‌ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సినీ దర్శకుడు రాజమౌళి రూ.500 కోట్లతో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తీస్తే, ఒక్క రూపాయి లేకుండా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో అంతకన్నా ఎక్కువ గ్రాఫిక్స్‌తో తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరంపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మద్యంపై వచ్చే ఆదాయం రూ.45 వేల కోట్లతో రాష్ర్టాన్ని కేసీఆర్‌ నడిపిస్తున్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, బూర మల్సూర్‌గౌడ్‌, యశ్వంత, నరేష్‌, వీరబాబు, విజయ్‌, రామరాజు, బాలాజీనాయక్‌, రవి పాల్గొన్నారు. అదేవిధంగా మఠంపల్లి మండలకేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కంఠమహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ భూమి పూజలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.యాదగిరిగౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న గౌడ కులస్థులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో రామ్మోహనగౌడ్‌, కృష్ణమూర్తిగౌడ్‌, వెంకన్నగౌడ్‌, కిషోర్‌గౌడ్‌, సైదులుగౌడ్‌, సుజాతశ్రీనివా్‌సగౌడ్‌, నర్సింగ్‌ వెంకటేశ్వర్లు, గురవయ్యగౌడ్‌, మహే్‌షగౌడ్‌, ఎల్లయ్యగౌడ్‌, నర్సయ్యగౌడ్‌, వెంకన్నగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:24:02+05:30 IST