ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-28T05:58:09+05:30 IST

ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఆర్టీసీ సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్మల, ఆర్టీసీ కస్టమర్‌ రిలేషన్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌ అన్నారు.

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చెట్లముకుందాపురంలో ఆర్టీసీ సేవలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

పెన్‌పహాడ్‌, సెప్టెంబరు 27 : ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఆర్టీసీ సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్మల, ఆర్టీసీ కస్టమర్‌ రిలేషన్‌ కోఆర్డినేటర్‌ రవికుమార్‌ అన్నారు. మండలంలోని చెట్లముకుందాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు సేవలపై గ్రామస్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు, విద్యార్థులకు అందజేస్తున్న బస్‌పాసు ఉపయోగాలు, బస్సు ప్రయాణాలతో లాభాలపై వివరించారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్‌ శోభారాణి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో బస్సు సర్వీసు కల్పించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకాంబరం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Read more