అనుమానాస్పదంగా వివాహిత మృతి

ABN , First Publish Date - 2022-07-05T07:15:53+05:30 IST

మండలంలోని మాదినపాడు గ్రామానికి చెందిన గాజుల కృష్ణవేణిగా(26)అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనుమానాస్పదంగా వివాహిత మృతి

దాచేపల్లి, జూలై 4: మండలంలోని  మాదినపాడు గ్రామానికి చెందిన గాజుల కృష్ణవేణిగా(26)అనుమానాస్పదంగా మృతి చెందింది.   పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  కృష్ణవేణి స్వగ్రామం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామం. ఆమెను దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావుకు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. నాగేశ్వరరావు మద్యానికి బానిసై తరచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. అతడిలో మార్పు వస్తుందని ఆరు నెలల క్రితం  భార్య తన పుట్టినిల్లు అయిన అడవిదేవరపల్లి గ్రామానికి తీసుకువెళ్లింది. అప్పటినుంచి ఆ గ్రామంలోనే నివసిస్తున్నారు.  ఇటీవల ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద నగదు విడుదల చేయటంతో ఆ నగదును తీసుకునేందుకు అడవిదేవరపల్లి నుంచి మాదినపాడు గ్రామానికి మూడు రోజులక్రితం వచ్చాడు. అమ్మఒడి పథకం డబ్బులు తీసుకోవటంతోపాటు వేరే వ్యక్తి వద్ద కూడా డబ్బులు రావాల్సి ఉండటంతో ఆ డబ్బులు కూడా తీసుకొని ఆదివారం సాయం త్రం అడవిదేవరపల్లికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. ఆ తర్వాత ఏం జరి గిందో తెలియదుగాని,  కృష్ణవేణి మార్గమధ్యలోని ఏపీ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచే పల్లి మండలం గామా లపాడు గ్రామ శివారు లోని  పంట పొలాల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.   పోలీసులు తమ దర్యాప్తులో  మృతురాలు మాదినపాడు గ్రామానికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. భర్త నాగేశ్వరరావు ఆచూకీ  తెలియడంలేదు.  మృతిరాలి నోటి నుంచి నురగ కూడా వచ్చింది. భర్తే ఆమెకు కూల్‌ డ్రింకులో విషం కలిపి తాగించి హత్య చేసి పరారయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. మృతురాలికి ఏడు, ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణవేణి  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దాచేపల్లి సీఐ బిలాలుద్దిన్‌ తెలిపారు.Read more