విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-03-05T06:35:16+05:30 IST

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట అర్బన్‌, మార్చి 4: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి యువశక్తి ఎంతో అవసరమన్నారు. వ్యసనాలకు బానిసై విద్యార్థులు, యువకులు శక్తిని కోల్పోవద్దన్నారు. యువతకు ప్రభుత్వం మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి, వంటి మత్తుపదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ నేరమని విద్యార్థులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మోహన్‌కుమార్‌, సీఐ ఆంజనేయులు, కళాశాల డైరెక్టర్‌ కిరణ్‌, ప్రిన్సిపాల్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:35:16+05:30 IST