ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-08T05:57:45+05:30 IST
కొండమల్లేపల్లి మండ ల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నితిన(16) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొండమల్లేపల్లి, ఆగస్టు 7: కొండమల్లేపల్లి మండ ల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నితిన(16) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం కొండమల్లేపల్లి లో చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెం దిన నాగేంద్ర, సరోజ దంపతులకు ఇద్ద రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నితిన మల్లేపల్లిలో పదో తరగతి, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో 8వ తరగతి చ దువుతున్నాడు. తండ్రి నాగేంద్ర ఐదేళ్ల క్రితం తాపీ ప నికి వెళ్లి బిల్డింగ్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. సరోజ కొండమల్లేపల్లి సాగర్ రోడ్డులో చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుమారులను పోషిస్తుంది. హైదరాబాద్ తుర్కమంజల్ వద్ద పండుగ చేస్తున్నామని బంధువుల పిలుపు మేరకు ఆమె ఆదివారం బ యలుదేరింది. ఆమెను పెద్ద కుమారుడు నితిన కొండమల్లేపల్లి బస్టాండ్‌కు తీసుకువ చ్చి బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యానకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు తల్లికి సమాచారం అందించడంతో ఆమె వెంటనే వెనుదిరిగింది. ఇంటికి వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవ ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు.