గోదావరి, కృష్ణా జలాల సాధనకోసం పోరాటం

ABN , First Publish Date - 2022-07-18T06:17:08+05:30 IST

మూసీ మురికి కాలుష్యం నుంచి ఈ ప్రాంత రైతాంగాన్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న గోదావరి, కృష్ణా జలాలల ద్వారా ప్రజలను రైతులను పాడి పరిశ్రమను కాపాడాలని, దీనికి ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని రైతు సంఘం జాతీయ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు.

గోదావరి, కృష్ణా జలాల సాధనకోసం పోరాటం
సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జాతీయ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి



  రైతు సంఘం జాతీయ నాయకుడు నంద్యాల, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి

వలిగొండ, జూలై 17: మూసీ మురికి కాలుష్యం నుంచి ఈ ప్రాంత రైతాంగాన్ని రక్షించేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న గోదావరి, కృష్ణా జలాలల ద్వారా ప్రజలను రైతులను పాడి పరిశ్రమను కాపాడాలని, దీనికి ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని రైతు సంఘం జాతీయ నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. మండలంలోని గోకారం గ్రామంలో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసీ నీటి ద్వారా రైతులు పంటలు పండిస్తున్నారని, 15 సంవత్సరాలుగా మురికి నీటిలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల వ్యర్థ జలాలను వదలండంతో నీటి కాలుష్యం పెచ్చరిల్లిందని అన్నారు.  ఈ విషపు నీటిని శుద్ధి చేస్తామని ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించిన చిత్త శుద్ది లోపించడంతో మూసీ మురికి కాలుష్యం పోవడం లేదని అన్నారు. బస్వాపురం ప్రాజెక్ట్‌ కెనాల్‌ ద్వారా వడపర్తి కత్వ మీదుగా గోదావరి కృష్ణా జలాలను మళ్లించాలన్నారు. గోకారం చెరువును మినీ రిజర్వాయర్‌గా ఏర్పాటు చేయాలన్నారు.  సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రాంచందర్‌, నాయకులు తుర్కపల్లి సురేందర్‌, వాకిటి వెంకట్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు ఏలె కృష్ణ, యాదయ్య, ముత్యాలు, చంద్రమౌళి, కవిడె సురేష్‌, లింగం పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-18T06:17:08+05:30 IST