మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T23:50:22+05:30 IST

పల్లెప్రకృతి వనంలో మొక్కలు ఎండకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా ఆదేశించారు.

మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
నకిరేకల్‌లో మొక్క నాటుతున్న అదనపు కలెక్టర్‌

నకిరేకల్‌/ నల్లగొండ/ కట్టంగూరు, డిసెంబరు 7: పల్లెప్రకృతి వనంలో మొక్కలు ఎండకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా ఆదేశించారు. నకిరేకల్‌ మండలంలోని కడపర్తి, చందంపల్లి గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాల య భవనాలు, పల్లె ప్రకృతివనం, నర్సరీని బుధవారం పరిశీలించా రు. నకిరేకల్‌ మున్సిపాలిటీలో త్వరలో ఏర్పాటు చేయనున్న వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, పట్టణ ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ బాలాజీ, ఎంపీవో నాగలక్ష్మి ఉన్నారు. సా యుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా విరాళం అందజేసి ర్యాలీ ప్రారంభించారు. సా యుధ దళాల సంక్షేమానికి ప్రతిఒక్కరూ సాయం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి మక్బూల్‌ అహ్మద్‌, సిబ్బంది శివకుమార్‌, అంజద్‌ షరీఫ్‌, నర్సింహ, ఉన్నారు. కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని కంపోస్టు షెడ్‌ నిర్వహణ పనులను అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా పరిశీలించారు. ట్రాక్టర్‌ ద్వారా ఇంటింటికీ చెత్త సేకరించి కంపోస్టు చేయడం ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, ఎంపీవో మహ్మద్‌ అథర్‌ ఫర్వేజ్‌, సర్పంచ్‌ బెజవాడ సరోజసైదులు, ఏపీ వో రాంమోహన్‌, ఉపసర్పంచ్‌ లింగయ్య, పంచాయతీ కార్యదర్శి హరిచంద్ర ఉన్నారు.

Updated Date - 2022-12-07T23:50:25+05:30 IST