నేరాల నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

జిల్లాలో నేరాల నివారణకు పోలీస్‌ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మంగళవా రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడా రు.

నేరాల నివారణకు చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ 

సూర్యాపేటక్రైం, సెప్టెంబరు 13: జిల్లాలో నేరాల నివారణకు పోలీస్‌ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మంగళవా రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడా రు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. కేసులు పెం డింగ్‌ లేకుండా దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలన్నారు. నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయాల న్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పం దించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలన్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బందికి హైద రాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, సీఐలు తుల శ్రీనివాస్‌, సోమనారాయణసింగ్‌, కె.శివశంక ర్‌, రాజశేఖర్‌, రామలింగారెడ్డి, నాగార్జున, రాజేష్‌, ఆంజనేయులు, పీఎన్‌డీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more