బతుకమ్మ నిమజ్జనానికి చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-02T06:24:16+05:30 IST

నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు వద్ద సద్దుల బతుకమ్మ రో జున బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు.

బతుకమ్మ నిమజ్జనానికి చర్యలు చేపట్టాలి
వల్లభరావు చెరువు పరిశీలిస్తున్న దృశ్యం

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి 

నల్లగొండటౌన, అక్టోబరు 1: నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు వద్ద సద్దుల బతుకమ్మ రో జున బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారె డ్డి ఇతర అధికారులతో కలిసి వల్లభరావు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుతశాఖ విద్యుత స్తంభాలు, వైర్లు బతుకమ్మ నిమజ్జనం చేసేందుకు అడ్డంగా ఉం టే తొలగించాలన్నారు. మునిసిపల్‌ అధికారులు లై టింగ్‌, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారివెంట ఆర్డీవో జగన్నాథరావు పాల్గొన్నారు.  


Read more