మిర్యాలగూడలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
ABN , First Publish Date - 2022-08-18T02:26:42+05:30 IST
భారత స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో..

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత స్వాత్రంత్య వజ్రోత్సవాల సందర్భంగా స్వదేశీ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో కలిసి నల్లగొండ జిల్లా చెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను నిర్వహించనుంది. ఈ నెల 20, 21 తేదీల్లో మిర్యాలగూడలో పోటీలు నిర్వహించనున్నారు. పోటీల గోడపత్రికలను డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు మిర్యాలగూడలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పోటీలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్లకు 9581760789, 8985686228 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో జిలా చెస్ సంఘం అధ్యక్షుడు మాశెట్టి శ్రీనివాస్, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ, కీర్తి అశోక్, ప్రవీణ్‌కుమార్, ధర్మేంద్ర, నేతాజీ తదితరులు పాల్గొన్నారు.