మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా సృజన

ABN , First Publish Date - 2022-09-02T06:11:19+05:30 IST

భారత జాతీయ మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన ఉస్తేల సృజనను ఏకగ్రీవ ఎన్నుకున్నారు.

మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా సృజన
సృజన

చింతలపాలెం సెప్టెంబరు 1: భారత జాతీయ మహిళ సమాఖ్య  రాష్ట్ర అధ్యక్షురాలిగా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన ఉస్తేల సృజనను ఏకగ్రీవ ఎన్నుకున్నారు. గత నెల 28, 29, 30 తేదీల్లో హనుమ కొండలో నిర్వహించిన భారత జాతీయ మహిళ సమాఖ్య మహాసభల్లో రెండోసారి అధ్యక్షురాలిగా సృజను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలు, హక్కులపై పోరాటాలు చేస్తాన న్నారు. తన ఎన్నికకు సహకరించిన సీపీఐ మహిళా సమాఖ్య   జాతీయ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు


Updated Date - 2022-09-02T06:11:19+05:30 IST