క్రీడలు జాతీయస్ఫూర్తిని చాటుతాయి

ABN , First Publish Date - 2022-08-17T06:21:48+05:30 IST

క్రీడలు జాతీయస్ఫూర్తి ని చాటుతాయని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

క్రీడలు జాతీయస్ఫూర్తిని చాటుతాయి
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

 కలెక్టర్‌ పమేలా సత్పథి 

భువనగిరి టౌన్‌, ఆగస్టు 16: క్రీడలు జాతీయస్ఫూర్తి ని చాటుతాయని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. స్వ తంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫ్రీడం కప్‌ ఫైనల్‌ పోటీలను మంగళవారం భువనగిరిలో ఆమె ప్రా రంభించి మాట్లాడారు. ఇటీవ ల కామన్‌వెల్త్‌ గే మ్స్‌, ఒలంపిక్స్‌లో క్రీడాకారులు సాధించిన పతకాలతో క్రీడారంగంలో దేశ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. క్రీడల్లో తీసుకునే ప్రతి సమష్టి నిర్ణయం ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. జిల్లా లో  క్రీడావసతులు కల్పిస్తామని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నీలు నిర్వహిస్తామని, ప్రతిభ చూ పే క్రీడాకారులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిల ర్‌ గోమారి సుధాకర్‌రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి కె.ధనాంజనేయులు, సైదులు, కోచ్‌లు, పీఈటీలు, అధికారు లు పాల్గొన్నారు. మండలస్థాయిలో గెలిచిన గ్రామజట్లు జి ల్లా ఫ్రీడం కప్‌కు అర్హతసాధించాయి. అయితే మహిళలు, పురుషులకు వేర్వేరుగా టోర్నీలు నిర్వహించాలని అధికారు లు సంకల్పించినప్పటికీ మహిళల జట్లు రాకపోవడంతో కేవలం పురుషులకు మాత్రమే పోటీలు నిర్వహించారు. 


జిల్లా స్థాయి ఫ్రీడం కప్‌ విజేతలు 

కబడ్డీ:దత్తప్పగూడెం,మోత్కూరు మండలం (ప్రథమ), పచ్చర్లబోడు తండా, భువనగిరి మండలం (ద్వితీయ), 

వాలీబాల్‌: తుర్కపల్లి(ప్రథమ), వలిగొండ (ద్వితీ య ),ఖోఖో- అనాజీపురం, భువనగిరి మండలం (ప్రథమ), పుట్టగూడెం, రాజాపేట మండలం(ద్వితీయ), 

లాంగ్‌ జంప్‌: రాజాపేటకు చెందిన బి.నరేష్‌ ప్రథమ, బి.ప్రవీణ్‌ ద్వితీయ బహుమతులు సాధించగా గుండాలకు చెందిన వికుమార స్వామి తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు 18న కలెక్టరేట్‌లో నిర్వహించనున్న వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు. 


ఉపాధి పనుల ప్రగతిలో జిల్లాను ముందుంచాలి

సమ్మె తర్వాత తిరిగి విధుల్లో చేరి న ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్రమశిక్షణతో ఉంటూ ఉపాధిహామీ పనుల ప్రగతిలో జిల్లాను ముందుంచాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి, జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, అదనపు డీఆర్‌డీవో టి నాగిరెడ్డి, ఏపీడీ శ్యామల, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సంపత్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు బబ్బూరి శంకర్‌ గౌడ్‌ తదితరులున్నారు. 


సమస్యల పరిష్కారంలో కవితలు దోహదపడుతాయి 

సమస్యల పరిష్కారంలో కవితలు దోహదపడుతాయని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కవులను సన్మానించారు. కార్యక్రమంలో సీడబ్యూ్లీస చైర్‌పర్సన్‌ బండారు జయశ్రీ, రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-17T06:21:48+05:30 IST