ఆరు కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-08-04T05:44:52+05:30 IST
ఆరు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్ పల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ విష్ణుమూర్తి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుం డగా.. కోదాడ నుంచి వస్తున్న లారీలో ఉన్న మహ్మద్ సమీద్, మహ్మద్ అజార్ గమనించి లారీ దిగి పక్కకు వెళ్లారు.
చివ్వెంల, ఆగస్టు 3: ఆరు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్ పల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ విష్ణుమూర్తి సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుం డగా.. కోదాడ నుంచి వస్తున్న లారీలో ఉన్న మహ్మద్ సమీద్, మహ్మద్ అజార్ గమనించి లారీ దిగి పక్కకు వెళ్లారు. పోలీసులు అనుమానంతో వారిని అదుపు లోకి తీసుకుని తనిఖీ చేయగా ఆరు కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఈ ఇద్దరు నిందితులతో పాటు వీరికి సహకరించిన షేక్ కమ్రో ద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.60వేలు ఉంటుందని సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్న పోలీసులను సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అభినందించారు. గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.