ఉపకార వేతనానికి ఆదర్శ విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2022-07-17T06:35:03+05:30 IST
జాతీయ ప్రతిభా పురస్కారం కింద కేంద్ర ప్రభు త్వం అందించే ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనం పొందేందుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
నిడమనూరు, జూలై 16: జాతీయ ప్రతిభా పురస్కారం కింద కేంద్ర ప్రభు త్వం అందించే ఎన్‌ఎంఎంఎస్ ఉపకార వేతనం పొందేందుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన పెందోటి భావన, ఇంద్రవల్లి శృతి, సపావత్ హారిక అనే ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం అందిస్తుందని ప్రిన్సిపాల్ రంజిత తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, సిబ్బందిని ఆమె అభినందించారు.