10 లీటర్ల నాటుసారా స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-11T06:44:32+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీ నం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

10 లీటర్ల నాటుసారా స్వాధీనం

దేవరకొండ, జూన 10: అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను స్వాధీ నం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై 10 లీటర్ల సారా ఎర్రారం గ్రామానికి తరలిస్తున్నాడు. రూట్‌ వాచ చేస్తున్న పోలీసులు శ్రీనును పట్టుకొని సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీనుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. 


Read more